జూనియర్ ఆటగాళ్ల వయస్సు నిర్ధారణకు వాస్తవ డాక్యుమెంట్స్ లేని పక్షంలో వారి పుట్టిన తేది సర్టిఫికెట్ల ఆధారంగా లేక శాస్త్రీయ పద్ధతిన లెక్కలోకి తీసుకోవాలని ఢిల్లీ కోర్టు సూచించింది.
న్యూఢిల్లీ: జూనియర్ ఆటగాళ్ల వయస్సు నిర్ధారణకు వాస్తవ డాక్యుమెంట్స్ లేని పక్షంలో వారి పుట్టిన తేది సర్టిఫికెట్ల ఆధారంగా లేక శాస్త్రీయ పద్ధతిన లెక్కలోకి తీసుకోవాలని ఢిల్లీ కోర్టు సూచించింది. బీసీసీఐ అండర్-16 క్రికెట్ టోర్నీలో వయస్సు ఎక్కువైందనే కారణంతో అనుమతి ఇవ్వకపోడంతో యాష్ సెహ్రావత్, ఆర్యన్ సెహ్రావత్ కోర్టుకెక్కారు.
ఈ టోర్నీ కోసం వారి వయస్సును నిర్ధారించేందుకు బోర్డు ఉపయోగించిన టానర్ వైట్‌హౌస్ 3 (టీడబ్ల్యు-3) పద్ధతిని జస్టిస్ వీకే జైన్ తిరస్కరించారు. దీనికి బదులుగా పిటిషనర్లు అందించిన సర్టిఫికెట్ల వాస్తవికతను బీసీసీఐ నిర్ధారించుకోవాలని సూచించారు. ఒకవేళ అవి అసలైనవే అయితే అందులో పేర్కొన్న వయస్సునే టోర్నీకి అర్హతగా భావించాలని పేర్కొన్నారు.