అవకాశాలు వస్తే సినిమాల్లో నటిస్తా! | Common Wealth Champion Sathish Kumar Shivalingam Movie Entry Soon | Sakshi
Sakshi News home page

సినిమాల్లో నటిస్తా!

Jun 28 2018 7:27 AM | Updated on Jun 28 2018 7:27 AM

Common Wealth Champion Sathish Kumar Shivalingam Movie Entry Soon - Sakshi

కామన్వెల్త్‌ చాంపియన్‌ సతీశ్‌కుమార్‌ శివలింగం

పెరంబూరు: అవకాశాలు వస్తే సినిమాల్లో నటించడానికి సిద్ధం అని కామన్వెల్త్‌ చాంపియన్‌ సతీష్‌కుమార్‌ శివలింగం పేర్కొన్నారు. ఈయన ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని గెలుచుకుని ఆ క్రీడలో పథకం గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కారు. ఒక వాణిజ్య సంస్థకు బ్రాండ్‌ అంబాసీడర్‌గా నియమితులైన సతీష్‌కుమార్‌ శివలింగం బుధవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. వాణాజ్య ప్రకటనలు, సినిమాల్లో నటించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు సతీష్‌కుమార్‌ శివలింగం బదులిస్తూ అలాంటి అవకాశాలు వస్తే, సమయం కుదిరితే తప్పకుండా నటిస్తానని చెప్పారు. అయితే తాను ఎక్కువ సమాయాన్ని క్రీడా శిక్షణలోనే గడుపుతానని తెలిపారు. ప్రతిభ కలిగిన యువకులు గ్రామాల్లో చాలా మంది ఉన్నారని, వారంతా క్రీడల్లో రాణించడానికి మీరిచ్చే సలహా ఏమిటన్న ప్రశ్నకు యువత నిరంతర శిక్షణ పొందాలన్నారు. క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడా ప్రేక్షకులు కూడా  క్రికెట్‌ క్రీడలానే ఇతర క్రీడలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement