హిందీ కంటే సౌత్‌ సినిమాలే మెరుగ్గా రాణిస్తున్నాయి: కాజల్‌ | Kajal Aggarwal Says South Indian Film Industry Excels In Professionalism And Creativity, Deets Inside | Sakshi
Sakshi News home page

హిందీ కంటే సౌత్‌ సినిమాలే మెరుగ్గా రాణిస్తున్నాయి: కాజల్‌

Jun 9 2026 9:21 AM | Updated on Jun 9 2026 10:12 AM

Kajal Aggarwal Says South Is Superior In Professionalism

వృత్తిపరమైన అంశాల్లో దక్షిణాది చిత్ర పరిశ్రమదే పైచేయి అంటున్నారు హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘నటీ మణులకు ఉత్తరాదిలో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయా? లేక దక్షిణాదిలోనా?’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి కాజల్‌ అగర్వాల్‌ బదులిస్తూ–   ‘‘అవకాశాలైతే రెండు చోట్ల (ఉత్తరాది, దక్షిణాది) ఉన్నాయని నేను నమ్ముతున్నాను. కానీ, వృత్తిపరమైన నైపుణ్యం, నిబద్ధత విషయాల్లో మాత్రం దక్షిణాది ఉన్నతమైనది. అద్భుతమైన దర్శకులు, గొప్ప సాంకేతిక నిపుణులు, కథాంశాలు, సృజనాత్మకత మనకు సౌత్‌లోనే కనిపిస్తున్నాయి. 

దక్షిణాది సినిమా పరిధి కూడా పెరిగింది. చాలా హిందీ సినిమాల కంటే సౌత్‌ సినిమాలు మెరుగ్గా రాణిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ మూవీ జూలై 24న రిలీజ్‌ కానుంది. అలాగే బాలకృష్ణ–గోపీచంద్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా, రణ్‌బీర్‌కపూర్‌ ‘రామాయణ’ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో కాజల్‌ నటిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement