'నరైన్ రాకతో మరింత బలం' | Clean chit to Narine's action a big boost for KKR, Shakib Al Hasan | Sakshi
Sakshi News home page

'నరైన్ రాకతో మరింత బలం'

Published Fri, Apr 8 2016 8:27 PM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

'నరైన్ రాకతో మరింత బలం'

'నరైన్ రాకతో మరింత బలం'

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆరంభానికి ముందు తమ ఆటగాడు సునీల్ నరైన్ బౌలింగ్ శైలి నిబంధనలకు లోబడే ఉందని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి క్లియరెన్స్ లభించడం పట్ల కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ హర్షం వ్యక్తం చేశాడు.

కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆరంభానికి ముందు తమ  ఆటగాడు సునీల్ నరైన్ బౌలింగ్ శైలిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి క్లియరెన్స్ లభించడం పట్ల కోల్ కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ హర్షం వ్యక్తం చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో నరైన్ కలుస్తుండటం  తమ జట్టుకు మరింత బలాన్నిస్తుందన్నాడు. 'కేకేఆర్ జట్టులో నరైన్ కీలక ఆటగాడు. మా జట్టు విజయాల్లో ఎప్పుడూ నరైన్ ముఖ్య పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. మా జట్టుకు ఇదొక సానుకూల సంకేతం'అని షకిబుల్ తెలిపాడు.

వివాదాస్పద బౌలింగ్ శైలి కారణంగా గత కొంత కాలంగా నరైన్ క్రికెట్ కు దూరమైనా.. అతని గౌరవం ఏమాత్రం తగ్గదని షకిబుల్ పేర్కొన్నాడు. ఒక నాణ్యమైన స్పిన్నర్ పై ఆ విషయం ఎటువంటి ప్రభావం చూపదన్నాడు. ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో నరైన్ కు ఒక ప్రత్యేక స్థానం ఉందని షకిబుల్ ఈ సందర్భంగా తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement