ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన ధోని సేన | Chennai Super Kings win toss, elect to bowl | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌: టాస్‌ గెలిచిన ధోని సేన

Apr 7 2018 7:51 PM | Updated on Apr 7 2018 8:16 PM

Chennai Super Kings win toss, elect to bowl - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా ఇక్కడ శనివారం వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందుగా ప్రత్యర్థి ముంబైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. నిషేధం కారణంగా రెండు సీజన్ల పాటు లీగ్‌కు దూరమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్రారంభపు మ్యాచ్‌లోనే టాస్‌ గెలవడంతో ఆ ఫ్రాంచైజీ అభిమానుల్లో ఆనందం నింపింది.


ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతోంది. గతేడాది ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ గెలిచి మూడో సారి టైటిల్‌ నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఫైనల్లో రైజింగ్‌ పుణెతో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో పరుగు తేడాతో విజయం సాధించడం ద్వారా ముంబై కొత్త రికార్డు లిఖించింది. మరొకవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండు సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజా సీజన్‌లో ఇరు జట్లు  పటిష్టంగా ఉండటంతో తొలి మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

తుది జట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌: ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, సురేశ్‌ రైనా, కేదర్‌ జాదవ్‌, డ్వేన్‌ బ్రేవో, రవీంద్ర జడేజా, హర్భజన్‌ సింగ్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, మార్క్‌ వుడ్‌, దీపక్‌ చాహర్‌

ముంబై ఇండియన్స్‌: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), హర్దిక్‌ పాండ్యా, కీరోన్‌ పొలార్డ్‌, ఎవిన్‌ లూయిస్‌, ఇషాన్‌ కిషాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా, మయాంక మార్కాండే, మిచెల్‌ మెక్లిన్‌గన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, బూమ్రా

ఐపీఎల్‌ చాంపియన్స్‌ వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement