ప్లే ఆఫ్స్‌కు చెన్నై స్పార్టన్స్‌ | The Chennai Spartans teamed up to the playoffs | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్స్‌కు చెన్నై స్పార్టన్స్‌

Feb 18 2019 2:26 AM | Updated on Feb 18 2019 2:26 AM

The Chennai Spartans teamed up to the playoffs - Sakshi

చెన్నై: ప్రొ వాలీబాల్‌ లీగ్‌లో చెన్నై స్పార్టన్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. లీగ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్పార్టన్స్‌ 15–6, 13–15, 15–13, 15–11, 15–12తో అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌పై గెలుపొంది ప్లే ఆఫ్స్‌ బెర్తు దక్కించుకుంది. స్పార్టన్స్‌ ఆటగాడు రూడీ వెర్చాఫ్‌ 18 స్పైక్స్, 2 సర్వ్‌ పాయింట్లతో మొత్తం 20 పాయింట్లు స్కోర్‌ చేసి అతని పేరిటే ఉన్న రికార్డును మరోసారి అందుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో 20 పాయింట్లు సాధించడం వెర్చాప్‌కిది మూడోసారి. అంతేకాకుండా వెర్చాఫ్‌ 80 పాయింట్లు సాధించి లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటికే ఈ టోర్నీలో కాలికట్‌ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్‌ సెమీస్‌లో అడుగుపెట్టాయి. నేడు యు ముంబా వాలీ, అహ్మదాబాద్‌ స్పైకర్స్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో చివరిదైన నాలుగో ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు అవుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement