లారా ‘క్లీన్‌బౌల్డ్’ | Brian Lara dating former Miss Scotland Jamey Bowers | Sakshi
Sakshi News home page

లారా ‘క్లీన్‌బౌల్డ్’

Mar 1 2014 12:21 AM | Updated on Sep 2 2017 4:12 AM

లారా ‘క్లీన్‌బౌల్డ్’

లారా ‘క్లీన్‌బౌల్డ్’

వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.

మిస్ స్కాట్లాండ్‌తో ప్రేమాయణం
 ట్రినిడాడ్ : వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. నాలుగు పదులు దాటిన లారా తన కన్నా 20 ఏళ్లు చిన్నదైన మిస్ స్కాట్లాండ్ జేమీ బోవర్స్ (24)తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని లారానే వెల్లడించాడు.
 
 ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జేమీ బోవర్స్ నా గర్ల్‌ఫ్రెండ్. ఆమె ఓ అద్భుతం’ అని అన్నాడు. కొద్ది నెలలుగా ఈ ప్రేమపక్షులు డేటింగ్ చేస్తూ ట్రినిడాడ్, స్కాట్లాండ్‌లలో సందడి చేస్తున్నారట. ట్రినిడాడ్‌లో పుట్టిన జేమీ... స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో నివాసముంటోంది.  ఇప్పటికే లారాకు పెళ్లయింది, ఇద్దరు పిల్లలున్నారు. గతంలో ఎప్పుడూ లారా  వేరే అమ్మాయితో ప్రేమాయణం నడపలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement