లారా ‘క్లీన్‌బౌల్డ్’
మిస్ స్కాట్లాండ్తో ప్రేమాయణం
ట్రినిడాడ్ : వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. నాలుగు పదులు దాటిన లారా తన కన్నా 20 ఏళ్లు చిన్నదైన మిస్ స్కాట్లాండ్ జేమీ బోవర్స్ (24)తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని లారానే వెల్లడించాడు.
ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘జేమీ బోవర్స్ నా గర్ల్‌ఫ్రెండ్. ఆమె ఓ అద్భుతం’ అని అన్నాడు. కొద్ది నెలలుగా ఈ ప్రేమపక్షులు డేటింగ్ చేస్తూ ట్రినిడాడ్, స్కాట్లాండ్లలో సందడి చేస్తున్నారట. ట్రినిడాడ్‌లో పుట్టిన జేమీ... స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో నివాసముంటోంది. ఇప్పటికే లారాకు పెళ్లయింది, ఇద్దరు పిల్లలున్నారు. గతంలో ఎప్పుడూ లారా వేరే అమ్మాయితో ప్రేమాయణం నడపలేదు.