కేఎల్ రాహుల్‌కి ఇష్ట‌మైన క్రికెట‌ర్ ఆయ‌నే.. | Bollywood Actress React To KL Rahul New Look | Sakshi
Sakshi News home page

కేఎల్ రాహుల్‌కి ఇష్ట‌మైన క్రికెట‌ర్ ఆయ‌నే..

May 25 2020 11:19 AM | Updated on May 25 2020 11:38 AM

Bollywood Actress React To KL Rahul New Look  - Sakshi

లాక్‌డౌన్ కార‌ణంగా క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ ఇంట్లోనే స‌ర‌దాగా గ‌డుపుతూ ఎప్ప‌టిక‌ప్పుడు అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నాడు. తాజాగా త‌న కొత్త హెయిర్ క‌ట్‌కి సంబంధించిన ఓ ఫోటోను  షేర్ చేస్తూ.. "మైండ్ పోయింది, జుట్టు పోయింది "అంటూ స‌ర‌దాగా ఓ క్యాప్ష‌న్ కూడా జోడించాడు. దీనికి బాలీవుడ్ తార‌లు సైతం  స్పందించారు.  న‌టి అనుష్క రంజ‌న్ గిల్టీ అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రంజాన్ క‌పూర్ రాహుల్ హెయిర్‌క‌ట్‌పై లాల్ అంటూ  ఫ‌న్నీగా కామెంట్ చేశారు. ఈ ఏడాది  మార్చిలో  న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా చివ‌రిసారిగా మ్యాచ్ ఆడగా,  ఆ త‌ర్వాత క‌రోనా కార‌ణంగా అన్ని మ్యాచ్‌లు రద్దైన సంగ‌తి తెలిసిందే. దీంతో ఎప్పుడూ బిజి బిజీగా గ‌డిపే  క్రికెట‌ర్ల‌కు బోలెడంత స‌మ‌యం దొరికిన‌ట్ల‌య్యింది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్ లాంటి క్రికెట‌ర్లు రెగ్యుల‌ర్‌గా లైవ్ చాట్‌ల‌తో అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు.  (పాక్‌ మాజీ క్రికెటర్‌ తౌఫిక్‌ ఉమర్‌కు కరోనా )

ఇక ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న  రాహుల్.. త‌న వ‌ర్క‌వుట్ వీడియోల‌ను అభిమానుల‌తో పంచుకున్నాడు. అంతేకాకుండా క్రికెట్, త‌న కెరియ‌ర్ లాంటి ఎన్నో విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకున్నాడు.  మీకు ఇష్ట‌మైన క్రికెట‌ర్ ఎవ‌రు అని ఇటీవ‌లె ఓ అభిమాని అడ‌గ్గా..ఎబి డివిలియ‌ర్స్ తన ఆల్  టైమ్ ఫేవరెట్ బ్యాట్స్ మాన్ అని చెప్పుకొచ్చాడు. ప్ర‌స్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)  13 వ సీజ‌న్‌లో పంజాబ్‌కు చెందిన ఫ్రాంచైజీకి కెఎల్ రాహుల్ నాయకత్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఐపీఎల్ ఆడాల్సి ఉన్నా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా బీసీసీఐ మ్యాచ్‌ను వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.  (కేంద్రం అనుమతిస్తేనే ఐపీఎల్‌ )

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement