అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది.
న్యూఢిల్లీ: అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 204 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రకాశ్ (56 బంతుల్లో 90; 10 ఫోర్లు, ఒక సిక్స్), వెంకటేశ్వర రావు (45 బంతుల్లో 53; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించడం విశేషం. అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలో అధిగమించి విజయాన్ని దక్కించుకుంది. పాక్ తరఫున మొహమ్మద్ జాఫర్ (52 బంతుల్లో 88 నాటౌట్; 2 ఫోర్లు) అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. గురువారం జరిగే నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది.