గతేడాది రూ. 10.5 కోట్లు.. నేడు 2.3 కోట్లు | Big paycut for Dinesh Karthik | Sakshi
Sakshi News home page

గతేడాది రూ. 10.5 కోట్లు.. నేడు 2.3 కోట్లు

Feb 6 2016 11:29 AM | Updated on Sep 3 2017 5:04 PM

గతేడాది రూ. 10.5 కోట్లు.. నేడు 2.3 కోట్లు

గతేడాది రూ. 10.5 కోట్లు.. నేడు 2.3 కోట్లు

గతేడాది వేలంలో 10.5 కోట్ల రూపాయలకు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) అమ్ముడుపోయిన కీపర్/బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్కు ఈ సారి డిమాండ్ బాగా పడిపోయింది.

ఐపీఎల్-9 వేలం ఊహించని విధంగా సాగుతోంది. భారీ ధర పలుకుతారని భావించిన ఆటగాళ్లు తక్కువ ధరకు అమ్ముడు పోగా.. అనూహ్యంగా విదేశీ, దేశవాళీ ఆటగాళ్లపై ప్రాంఛైజీలు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఇక గతేడాది భారీ ధర పలికిన ఆటగాళ్లకు ఈ సారి డిమాండ్ తగ్గిపోయింది. గతేడాది వేలంలో 10.5 కోట్ల రూపాయలకు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) అమ్ముడుపోయిన కీపర్/బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్కు ఈ సారి డిమాండ్ బాగా పడిపోయింది. గుజరాత్ లయన్స్  2.3 కోట్ల రూపాయలకు దినేశ్ను కొనుగోలు చేసింది.

తొలివిడతలో అమ్ముడుబోని క్రికెటర్లు

మార్టిన్ గుప్టిల్, అరోన్ ఫించ్, రోసౌ, చటేశ్వర్ పుజారా, హషీం ఆమ్లా, బద్రీనాథ్, జార్జి బెయిలీ, మైకేల్ హస్సీ, మహేల జయవర్ధనె, ఉస్మాన్ ఖవాజ, ముష్ఫికర్ రహీం, బ్రాడ్ హాడిన్, వాన్ విక్, మనోజ్ తివారి, రవి బొపార, దిల్షాన్, జేసన్ హోల్డర్, డారెన్ సామీ, పెరెరా, నాథన్ లియోన్, దేవేంద్ర బిషూ, మైకేల్ బీర్, అజంతా మెండిస్, సులేమాన్ బెన్, రాహుల్ శర్మ, కామెరూన్ బాయ్సె, ప్రజ్ఞాన్ ఓజా, పెరుమాల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement