విజేత భవన్స్‌ కాలేజి | Bhavan College Wins Carrom Title | Sakshi
Sakshi News home page

విజేత భవన్స్‌ కాలేజి

Aug 19 2019 10:08 AM | Updated on Aug 19 2019 10:08 AM

Bhavan College Wins Carrom Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్‌ కాలేజి పురుషుల క్యారమ్‌ టోర్నమెంట్‌లో భవన్స్‌ కాలేజి (సైనిక్‌పురి) జట్టు చాంపియన్‌గా అవతరించింది. బద్రుకా కాలేజి (కాచిగూడ) ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహించారు. ఫైనల్లో భవన్స్‌ కాలేజి 2–0తో మఫకంజా (ఎంజే) ఇంజినీరింగ్‌ కాలేజిపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో భవన్స్‌ కాలేజి 2–0తో ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్‌ కామర్స్‌ కాలేజిపై, ఎంజే కాలేజి 2–0తో మాతృశ్రీ ఇంజినీరింగ్‌ కాలేజిపై విజయాలు సాధించి తుది పోరుకు చేరుకున్నాయి.

మూడో స్థానం కోసం జరిగిన పోరులో మాతృశ్రీ ఇంజినీరింగ్‌ కాలేజి 2–1తో ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్‌ కాలేజిని ఓడించింది. బద్రుకా కాలేజి ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ప్రిన్సిపాల్‌ డా.సోమేశ్వర్‌ రావు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ సెక్రటరీ ప్రొఫెసర్‌ బి.సునీల్‌ కుమార్, టోర్నీ సెక్రటరీ ప్రొఫెసర్‌ కె.దీప్లా తదితరులు హాజరయ్యారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement