బాత్‌రూమ్‌లు బాగుండాలి... | Bathrooms are crucial ... | Sakshi
Sakshi News home page

బాత్‌రూమ్‌లు బాగుండాలి...

May 31 2015 1:45 AM | Updated on Jun 15 2018 4:33 PM

గతంలో భారత్ చాలా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించాలంటే మాత్రం చుక్కలు కనిపించేలా ఉన్నాయి.

గతంలో భారత్ చాలా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించాలంటే మాత్రం చుక్కలు కనిపించేలా ఉన్నాయి. 2017లో భారత్ అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ నిర్వహించనుంది. దీనికోసం ఫిఫా అధికారులు టోర్నీ కోసం చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఒక జాబితా పంపించారు. ఇందులో ఏకంగా 8532 అంశాలు ఉన్నాయి. గదుల్లో ఉండాల్సిన ఫ్రిజ్‌లు, హెయిర్ డ్రయర్స్ దగ్గరి నుంచి బాత్‌రూమ్‌లు ఎలా ఉండాలో కూడా ఆ జాబితాలో ఉంది.

ఎక్కడా బండలు జారకూడదట. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండాల్సిన ఐస్ బరువుతో పాటు బాత్‌రూమ్ షవర్‌లో నీళ్లు ఎలా రావాలో కూడా ఆ జాబితాలో ఫిఫా పేర్కొంది. ఇక వేదికల్లో చేయాల్సిన ఏర్పాట్లు, మైదానంలో ఉండాల్సిన గడ్డి లెవల్... ఇలా ఆ జాబితా అంతా చదవడానికే రెండు రోజులు పడుతుందని టోర్నమెంట్ డెరైక్టర్ జేవియర్ సెప్పి తెలిపారు. ఫుట్‌బాలా మజాకా..!

Advertisement
 
Advertisement
Advertisement