పాక్‌ క్రికెటర్‌ జంషేడ్‌పై నిషేధం | ban on Pakistani cricketer jansed | Sakshi
Sakshi News home page

పాక్‌ క్రికెటర్‌ జంషేడ్‌పై నిషేధం

Feb 14 2017 12:39 AM | Updated on Sep 5 2017 3:37 AM

దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై మరో

కరాచీ: దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై మరో పాకిస్తాన్‌ క్రికెటర్‌ నాసిర్‌ జంషేడ్‌పై ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిషేధం విధించింది. ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఇప్పటికే ఇద్దరు పాక్‌ క్రికెటర్లు షర్జీల్‌ ఖాన్, ఖాలిద్‌ లతీఫ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు.

27 ఏళ్ల జంషేడ్‌ పాక్‌ తరఫున రెండు టెస్టులు, 48 వన్డేలు, 18 టి20 మ్యాచ్‌లు ఆడాడు. జంషేడ్‌ కోరినందుకే అంతర్జాతీయ బెట్టింగ్‌ సిండికేట్‌కు చెందిన వ్యక్తితో తాము భేటీ అయ్యామని విచారణ సందర్భంగా షర్జీల్, లతీఫ్‌ వెల్లడించడంతో పాక్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.  

 

Advertisement
 
Advertisement
Advertisement