బెయిర్‌ స్టో శతక్కొట్టుడు

Bairstow ton keeps India on the mat - Sakshi

బర్మింగ్‌హామ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ శతకంతో మెరిశాడు. ఆది నుంచి దూకుడుగా ఆడిన బెయిర్‌ స్టో 90 బంతుల్లో  8 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఇది బెయిర్‌ స్టోకు 8వ వన్డే సెంచరీ. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ఆది నుంచి ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టోలు చేలరేగి ఆడారు. ఈ జోడి తొలి వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత జేసన్‌ రాయ్‌(66) ఔటయ్యాడు. కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ రవీంద్ర జడేజా అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో రాయ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఆ తరుణంలో బెయిర్‌ స్టో-జోరూట్‌లు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలోనే బెయిర్‌ స్టో సెంచరీ నమోదు చేశాడు. కాగా, బెయిర్‌ స్టో 111 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఇంగ్లండ్‌ 32 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top