ఆమెతో కలసి గెలిచి.. ఆమెపైనే పోరాటం | Australian Open: Sania Mirza vs Martina Hingis in mixed-doubles quarters | Sakshi
Sakshi News home page

ఆమెతో కలసి గెలిచి.. ఆమెపైనే పోరాటం

Jan 27 2016 6:00 PM | Updated on Sep 3 2017 4:25 PM

ఆమెతో కలసి గెలిచి.. ఆమెపైనే పోరాటం

ఆమెతో కలసి గెలిచి.. ఆమెపైనే పోరాటం

మహిళల డబుల్స్లో జోడీగా ఆడుతున్న సానియా, హింగిస్ రేపు ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు.

మెల్బోర్న్: టెన్నిస్ మహిళల డబుల్స్ జోడీ భారత స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) రికార్డు విజయాలు సాధించారు. ఎన్నో టైటిళ్లు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్లో ఈ జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన సెమీస్లో సానియా, హింగిస్ ద్వయం విజయం సాధించింది. అయితే ఇదే ఈవెంట్లో రేపు వీరిద్దరూ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రత్యర్థులుగా తలపడనున్నారు.

ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా.. క్రొయేషియా ఆటగాడు ఇవాన్ డొడిగ్తో కలసి ఆడతుండగా, మరో భారత వెటరన్ లియాండర్ పేస్.. మార్టినా హింగిస్తో కలసి బరిలో దిగాడు. ఈ రెండు జోడీలు క్వార్టర్స్లో అడుగు పెట్టాయి. అయితే గురువారం జరిగే క్వార్టర్స్ పోరులో సానియా, ఇవాన్ జోడీ.. పేస్, హింగిస్ జంటతో అమీతుమీ తేల్చుకోనుంది. దీంతో మహిళల డబుల్స్లో జోడీగా ఆడుతున్న సానియా, హింగిస్ రేపు ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement