మరో టైటిల్కు అడుగు దూరంలో సానియా | Australian Open: Sania Mirza, Martina Hingis pair entres in final | Sakshi
Sakshi News home page

మరో టైటిల్కు అడుగు దూరంలో సానియా

Jan 27 2016 5:50 PM | Updated on Sep 3 2017 4:25 PM

సూపర్ ఫామ్లో ఉన్న భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది.

మెల్బోర్న్: సూపర్ ఫామ్లో ఉన్న భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్లో సానియా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

బుధవారం జరిగిన సెమీస్లో టాప్ సీడ్ సానియా, హింగిస్ 6-1, 6-0 స్కోరుతో జులియా జార్జెస్ (జర్మనీ), కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించారు. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో సానియా జోడీ వరుస సెట్లలో మ్యాచ్ను సొంతం చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement