భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
కాన్‌బెర్రా: భారత్ తో బుధవారమిక్కడ జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విజయం కోసం టీమిండియా ఆరాటపడుతుండగా, క్లీన్ స్వీప్ లక్ష్యంగా ఆసీస్ బరిలోకి దిగుతోంది.
భారత్ టీమ్ లో ఒక మార్పు చోటుచేసుకుంది. బరీందర్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ ను తీసుకున్నారు. ఆసీస్ టీమ్ లో రెండు మార్పులు జరిగాయి. బొలాండ్, షాన్ మార్ష్ స్థానంలో లియాన్, వార్నర్ జట్టులోకి వచ్చారు. ఐదు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0తో గెల్చుకుంది.