న్యూజిలాండ్‌ ఎదురీత

Australia vs New Zealand First Test Day Two - Sakshi

 తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 416

పెర్త్‌: ఆ్రస్టేలియాతో జరుగుతున్న డే నైట్‌ తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఎదురీదుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ 32 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసింది. ప్రస్తుతం రాస్‌ టేలర్‌ (66 బ్యాటింగ్, 8 ఫోర్లు) వాట్లింగ్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లు స్టార్క్‌ (4/31), హాజల్‌వుడ్‌ (1/0) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అంతకుముందు ఆ్రస్టేలియా 146.2 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 248/4తో తమ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆసీస్‌ను సెంచరీ హీరో లబ్‌õÙన్‌ (143; 18 ఫోర్లు, సిక్స్‌), హెడ్‌ (56; 10 ఫోర్లు) ముందుకు నడిపించారు. వీరు ఐదో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుట్‌ అయినా... పైన్‌ (39; 2 ఫోర్లు), స్టార్క్‌ (30; 3 ఫోర్లు, సిక్స్‌), కమిన్స్‌ (20; 2 ఫోర్లు) తలా ఒక చెయ్యి వేయడంతో ఆసీస్‌ భారీ స్కోరు చేసింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top