స్టెయిన్ ధమాకా | Australia v India: Steve Smith century leaves Test in balance | Sakshi
Sakshi News home page

స్టెయిన్ ధమాకా

Dec 21 2014 12:44 AM | Updated on Oct 5 2018 9:09 PM

స్టెయిన్ ధమాకా - Sakshi

స్టెయిన్ ధమాకా

తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా తీయని పేసర్ డేల్ స్టెయిన్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు.

తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం
 సెంచూరియన్: తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా తీయని పేసర్ డేల్ స్టెయిన్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు. కేవలం 34 పరుగులకే ఆరు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాకు భారీ విజయాన్ని అందించాడు. శనివారం సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 42.3 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. దీంతో సఫారీలకు ఇన్నింగ్స్ 220 పరుగుల విజయం దక్కింది.
 
 ఈ జట్టుకిది టెస్టుల్లో రెండో భారీ విజయం. 76/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన విండీస్‌కు తొలి సెషన్ నుంచే స్టెయిన్ దెబ్బ తగిలింది. కేవలం 44 పరుగులు మాత్రమే జత చేసి చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. ఇందులో ఆరింటిని స్టెయిన్ (8.2 ఓవర్లలో) ఒక్కడే తీయడం విశేషం. కీమర్ రోచ్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఆమ్లా నిలిచాడు. రెండో టెస్టు 26 నుంచి పోర్ట్ ఎలిజబెత్‌లో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement