
తాను స్వలింగ సంపర్కుడినంటూ... ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ తన 29వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం సంచలన ప్రకటన చేశాడు. ‘నా బాయ్‌ఫ్రెండ్ రొబుస్టాతో పాటు మా అమ్మతో కలిసి పుట్టిన రోజు డిన్నర్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో సహా పోస్ట్ చేశాడు.
ఆస్ట్రేలియా తరఫున ఒక టెస్టు, 69 వన్డేలు, 24 టి20లు ఆడిన ఫాల్క్‌నర్... ఏడాదిన్నరగా జట్టులోకి ఎంపిక కావడం లేదు. కాగా, తాను ‘గే’నంటూ చెప్పుకొన్న తొలి అంతర్జాతీయ క్రికెటర్ ఇంగ్లండ్‌కు చెందిన స్టీవెన్ డేవిస్. 2011లో అతడీ మేరకు ప్రకటన చేశాడు.