టూత్‌ పేస్ట్‌ కొనడానికి బయటకొచ్చి.. | Augsburg Coach Breaks Quarantine Rules To Buy Toothpaste | Sakshi
Sakshi News home page

క్వారంటైన్‌ రూల్స్‌ బ్రేక్‌ చేశాడు..

May 15 2020 12:33 PM | Updated on May 15 2020 12:33 PM

Augsburg Coach Breaks Quarantine Rules To Buy Toothpaste - Sakshi

హీకో హెర్లిచ్‌(ఫైల్‌ఫోటో)

బెర్లిన్‌: కరోనా వైరస్‌ కారణంగా తమ లాక్‌డౌన్‌ నిబంధనల్ని పలు దేశాలు కఠినంగా అమలు చేస్తూనే పలు ఆంక్షలతో కూడిన సడలింపులు ఇస్తున్నాయి. ఇలా లాక్‌డౌన్‌ అమలు చేస్తూ కొన్నింటికి మినహాయింపు ఇచ్చిన వాటిలో జర్మనీ ఒకటి.  రేపట్నుంచి(శనివారం) నుంచి జర్మనీలో బుండెస్లిగా ఫుట్‌బాల్‌ లీగ్‌ ఆరంభం కానుంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లంతా క్వారంటైన్‌ నిబంధనల్ని పాటిస్తున్నారు. కాగా, ఆగ్స్‌బర్గ్‌ జట్టుకు చెందిన కోచ్‌ హీకో హెర్లిచ్‌ మాత్రం క్వారంటైన్‌ నిబంధనల్ని ఉల్లంఘించాడు. టీమ్‌ బస చేసిన హోటల్‌లో ఉండకుండా బయటకొచ్చాడు. టూత్‌ పేస్ట్‌ అయిపోయిందని చెప్పి సూపర్‌ మార్కెట్‌కెళ్లి మరీ కొనుక్కొచ్చాడు. దీనిపై బుండెస్లిగా యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ కారణంగా ఆటగాళ్లతో సహా కోచ్‌లు కూడా క్వారంటైన్‌ నిబంధనల్ని పాటించాలని చెబితే బయటకు వెళ్లి చిన్నపాటి కారణాలు చెప్పడాన్ని ఆక్షేపించింది. ('వాడంటే నాకు ఇష్టం లేదు.. అందుకే చంపేశా')

ఇది ఒక కోచ్‌గా తగదంటూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో బుండెస్లిగా లీగ్‌ పునః ప్రారంభపు మ్యాచ్‌కు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ‘జర్మన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ టాస్క్‌ఫోర్స్‌ రూల్స్‌ను హెర్లిచ్‌ బ్రేక్‌ చేసిన కారణంగా అతను కనీసం ప్రాక్టీస్‌ సెషన్‌కు కూడా రాకుండా వేటువేసింది.. దీనిపై హెర్లిచ్‌ మాట్లాడుతూ.. ‘ హోటల్‌ నుంచి బయటకొచ్చి తప్పు చేశాను. నేను ఇప్పటివరకూ రూల్స్‌ పాటిస్తూ వచ్చాను. కానీ టూత్‌ పేస్ట్‌ లేకపోవడం వల్ల బయటకు రావాల్సి వచ్చింది. నేను చేసిన తప్పును అంగీకరిస్తున్నా.  ఒక రోల్‌ మోడల్‌గా ఉండాల్సిన నేను రూల్స్‌ను అతిక్రమించా. దాంతో ట్రైనింగ్‌తో పాటు మ్యాచ్‌ కూడా కోచ్‌గా చేసే అవకాశాన్ని కోల్పోయా. నాకు కరోనా టెస్టులు చేసి నెగిటివ్‌ వచ్చిన తర్వాత జట్టుతో కలుస్తా’ అని హెర్లిచ్‌ పేర్కొన్నాడు.కరోనా సంక్షోభం తర్వాత తిరిగి ప్రారంభం​ అవుతున్న యూరప్‌ తొలి మేజర్‌ లీగ్‌ ఇదే. శనివారం ఆరంభమయ్యే ఈ ఫుట్‌బాల్‌ లీగ్‌లో ఆగ్స్‌బర్గ్‌-వుల్ఫ్స్‌ బర్గ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ('జాగ్రత్త.. నేను బరిలోకి దిగుతున్నా')

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement