హిమ దాస్‌కు స్వర్ణం  | athlete Hima Das Won Gold In Czech Republic | Sakshi
Sakshi News home page

హిమ దాస్‌కు స్వర్ణం 

Aug 19 2019 6:33 AM | Updated on Aug 19 2019 6:33 AM

athlete Hima Das Won Gold In Czech Republic - Sakshi

న్యూఢిల్లీ: భారత యువ మహిళా అథ్లెట్‌ హిమ దాస్‌ మరోసారి మెరిసింది. చెక్‌ రిపబ్లిక్‌లో జరిగిన అథ్లెటికీ మిటింక్‌ రీటెర్‌ మీట్‌లో 300 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది. గత నెలన్నర వ్యవధిలో యూరోపియన్‌ సర్క్యూట్‌లో హిమ దాస్‌కిది ఆరో స్వర్ణం కావడం విశేషం. అయితే వచ్చే నెలలో దోహాలో జరిగే ప్రపంచ చాంపియ న్‌షిప్‌కు మాత్రం హిమ ఇంకా అర్హత సాధించలేదు.  

Advertisement
 
Advertisement
Advertisement