ప్రత్యూష విజయం | Asian Continental Chess championship:- Pratyusha success | Sakshi
Sakshi News home page

ప్రత్యూష విజయం

May 31 2016 12:07 AM | Updated on Sep 4 2017 1:16 AM

ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొడ్డ ప్రత్యూష రెండో విజయాన్ని........

 తాష్కెంట్: ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొడ్డ ప్రత్యూష రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో ప్రత్యూష 47 ఎత్తుల్లో భారత్‌కే చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్ (డబ్ల్యూజీఎం) మేరీఆన్ గేమ్స్‌పై సంచలన విజయం సాధించింది.

ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు వరుసగా రెండో పరాజయాన్ని చవిచూశాడు. చైనాకు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) యియె వాంగ్‌తో జరిగిన ఐదో రౌండ్ గేమ్‌లో లలిత్ బాబు 40 ఎత్తుల్లో ఓడిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement