ఆసియా చాంప్ ప్రాంజల | Asian champ | Sakshi
Sakshi News home page

ఆసియా చాంప్ ప్రాంజల

Apr 19 2015 12:35 AM | Updated on Sep 3 2017 12:28 AM

ఆసియా చాంప్ ప్రాంజల

ఆసియా చాంప్ ప్రాంజల

ఆసియా క్లోజ్డ్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచింది.

న్యూఢిల్లీ: ఆసియా క్లోజ్డ్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్ విభాగంలోనూ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల 5-7, 6-2, 7-5తో టాప్ సీడ్ వుషువాంగ్ జెంగ్ (చైనా)పై గెలిచింది.
 
  శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లోనూ ప్రాంజల తన సింగిల్స్ విభాగం ఫైనల్ ప్రత్యర్థి వుషువాంగ్ జెంగ్‌తో కలిసి టైటిల్ సాధించడం విశేషం. హైదరాబాద్‌లోని జీవీకే టెన్నిస్ అకాడమీలో కోచ్ ఇలియాస్ గౌస్ వద్ద శిక్షణ పొందుతున్న 16 ఏళ్ల ప్రాంజలకు ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్‌లో ఇది ఐదో సింగిల్స్ టైటిల్.
 

Advertisement
 
Advertisement
Advertisement