గ్రౌండ్‌మన్‌గా అర్జున్‌ టెండూల్కర్‌!

Arjun Tendulkar turns groundsman at home of cricket - Sakshi

లండన్‌: సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ లార్డ్స్‌ మైదానంలో గ్రౌండ్‌మన్‌ అవతారం ఎత్తాడు. గ్రౌండ్‌ స్టాఫ్‌తో కలిసి మైదానంలో సేవలు అందించాడు. భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య లార్డ్స్‌ మైదానంలో గురువారం ప్రారంభం కావాల్సిన రెండోటెస్టు తొలిరోజు ఆట వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అర్జున్‌ గ్రౌండ్‌ స్టాఫ్‌తో కలిసి మైదానంలో శ్రమించడం పలువురిని ఆకట్టుకుంది. గ్రౌండ్‌ స్టాఫ్‌తో కలిసి అర్జున్‌ టెండూల్కర్‌ సేవలందించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

గత నెలలో భారత అండర్‌-19 జట్టుతో కలిసి ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన అర్జున్‌ అక్కడే ఉండి ఎంసీసీ యంగ్‌ క్రికెటర్లతో కలిసి సాధన చేస్తున్నాడు. ఈ క‍్రమంలోనే టీమిండియా జట్టుకు నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తూ తన బౌలింగ్‌కు మరింత పదును పెట్టుకుంటున్నాడు.

చదవండి: టీమిండియాను ఇబ్బంది పెట్టిన అర్జున్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top