ఆర్చీ కోరిక తీరింది...  | Archie Schiller becomes Australia co-captain ahead of Boxing day test match | Sakshi
Sakshi News home page

ఆర్చీ కోరిక తీరింది... 

Dec 27 2018 12:51 AM | Updated on Dec 27 2018 12:51 AM

Archie Schiller becomes Australia co-captain ahead of Boxing day test match - Sakshi

ప్రతిష్ఠాత్మకమైన బ్యాగీ గ్రీన్‌ టోపీ అందుకున్నాడు... టాస్‌లోనూ పాల్గొన్నాడు... భారత్, ఆస్ట్రేలియా కెప్టెన్ల మధ్య తుది జట్ల జాబితా పంపకంలోనూ చేయేశాడు... మ్యాచ్‌పై తమ జట్టు దృక్పథం ఎలా ఉండబోతోందో విశ్లేషించాడు... మొత్తానికి ఆస్ట్రేలియా జాతీయ జట్టు కెప్టెన్‌ కావాలన్న తన కోరికను ఏడేళ్ల చిన్నారి ఆర్చీ షిల్లర్‌ తీర్చుకున్నాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న షిల్లర్‌ను ‘మేక్‌ ఏ విష్‌ ఆస్ట్రేలియా’ శాఖ కోరిక మేరకు మెల్‌బోర్న్‌ టెస్టుకు ఆస్ట్రేలియా కో–కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

దీంతో అతడు ఆకుపచ్చ బ్లేజర్‌లో జాతీయ గీతాలాపన సహా మ్యాచ్‌ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తన అభిమాన క్రికెటర్‌ నాథన్‌ లయన్‌ నుంచి బ్యాగీ గ్రీన్‌ టోపీ పొందిన షిల్లర్‌... ఇదంతా తన తల్లిదండ్రుల సమక్షంలోనే జరగడంతో మరింత ఆనందభరితుడయ్యాడు. ‘సిక్స్‌లు కొట్టండి... వికెట్లు తీయండి’ అంటూ చివరగా తమ జట్టు సభ్యులకు సందేశమిచ్చాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement