breaking news
archies
-
తొలి గ్రీటింగ్ అలా..‘ఆర్చీస్’ సామ్రాజ్యం ఇలా..
ఒకప్పుడు నూతన సంవత్సరం వేళ ప్రతి ఇంట్లోనూ సందడి చేసిన గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే.. 80, 90వ దశకాల్లో గ్రీటింగ్ కార్డ్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పండుగలు, పుట్టినరోజులు, ముఖ్యంగా కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ఒకరికొకరు కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం ఒక గొప్ప అనుభూతిగా ఉండేది. ఈ గ్రీటింగ్ కార్డుల విప్లవం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. రోడ్డు పక్కన పోస్టర్లు అమ్ముకునే ఒక సామాన్య యువకుడు.. కేవలం ఐదు వేల రూపాయల అప్పుతో భారతదేశంలో గ్రీటింగ్ కార్డుల విస్తృత వినియోగానికి నాంది పలికాడు. తద్వారా వందల కోట్ల కంపెనీని కూడా నెలకొల్పాడు.గ్రీటింగ్ కార్డ్ పుట్టుక.. లండన్ నుండి భారత్‌కు..గ్రీటింగ్ కార్డుల చరిత్ర 182 ఏళ్ల నాటిది. 1843లో లండన్‌కు చెందిన ప్రభుత్వ అధికారి సర్ హెన్రీ కోల్.. క్రిస్మస్ సందర్భంగా తనకు వచ్చే వందలాది లేఖలకు సమాధానం ఇవ్వలేక ఒక కొత్త ఆలోచన చేశారు. తన స్నేహితుడు, ఆర్టిస్ట్ జాన్ కాల్కాట్ హార్స్లీచేత ఒక చిత్రాన్ని గీయించి, దానిపై ‘క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని రాయించారు. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ గ్రీటింగ్ కార్డ్. బ్రిటీష్‌వారు భారత్‌ను పరిపాలిస్తున్న సమయంలో గ్రీటింగ్ సంస్కృతి భారత్‌లో ప్రవేశించింది. 1979లో అనిల్ మూల్చందాని అనే యువకుడు ‘ఆర్చీస్’ (Archies) సంస్థ ద్వారా గ్రీటింగ్ కార్డులను సామాన్యులకు చేరువ చేశారు.అప్పుతో మొదలైన ‘ఆర్చీస్’ ప్రస్థానంఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన అనిల్ మూల్చందాని, ఒకవైపు తన తండ్రికి చీరల దుకాణంలో సాయం చేస్తూనే, మరోవైపు పోస్టర్లు అమ్మేవారు. 1981లో ఆయన ఢిల్లీలోని కమలా నగర్లో కేవలం రూ. ఐదు వేల పెట్టుబడితో ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించారు. అనిల్ అమోఘ కృషితో ‘ఆర్చీస్’ బ్రాండ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. గ్రీటింగ్ కార్డులు ప్రతి మధ్యతరగతి ఇంటికీ చేరాయి. ఒకానొక దశలో ఈ కంపెనీ విలువ రూ.100 కోట్లకు చేరింది. నేటి సోషల్ మీడియా యుగంలోనూ ఈ సంస్థ సుమారు రూ. 70 కోట్ల విలువతో తన ఉనికిని చాటుకుంటోంది.డిజిటల్ యుగంలోనూ జ్ఞాపకాలుప్రస్తుత స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా కాలంలో వాట్సాప్ సందేశాలు ప్రాచుర్యం పొందినప్పటికీ, గ్రీటింగ్ కార్డుల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోలేదు. ఆన్లైన్ గిఫ్టింగ్ పోర్టల్స్ ద్వారా నేటికీ కార్డుల అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. చేతితో చక్కగా రాసిన సందేశం అందించే ఆత్మీయత డిజిటల్ మెసేజ్‌లలో కనిపించదని కొందరు నమ్ముతుంటారు. వారు ఇప్పటికీ శుభాకాంక్షలను తెలిపేందుకు గ్రీటింగ్ కార్డులనే ఎంచుకుంటున్నారు. అందుకే గ్రీటింగ్ కార్డుల యుగం ముగిసిందని చెప్పలేం.. అది కేవలం తన రూపాన్ని మార్చుకున్నదని మాత్రమే అనగలం.ఇది కూడా చదవండి: ఆ దేశాల్లో కానరాని సంబరాలు.. కారణమిదే.. -
జగనన్న కాలనీలకు స్వాగత ద్వారాలు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు ప్రభుత్వం గృహ యోగం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి గేటెడ్ కమ్యూనిటీల రీతిలో తీర్చిదిద్దుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 75 వేల కోట్ల విలువ చేసే స్థలాలను 30.7 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తోంది. కాలనీల్లో మౌలిక వసతులను కల్పించి గేటెడ్ కమ్యూనిటీల్లా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 25 అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న కాలనీలకు స్వాగత ద్వారాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 5,684 ఆర్చిల నిర్మాణానికి శ్రీకారం 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ+2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాధారణ ఇళ్లు నిర్మిస్తున్న 5,684 కాలనీలకు ఆర్చ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇప్పటికే ఈ పనుల కోసం 2,314 ప్రాంతాల్లో టెండర్లను ఖరారు చేయగా వీటిలో 594 కాలనీల్లో పనులు ప్రారంభించారు. పలు కాలనీల్లో వీటి నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. 32,909 కోట్లతో కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. -
The Archies Screening: ద ఆర్చీస్ గ్రాండ్ ప్రీమియర్.. కదిలొచ్చిన బాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)
-
Bureau of Indian Standards: 18వేల ఆటబొమ్మలు సీజ్
న్యూఢిల్లీ: గత నెల రోజుల వ్యవధిలో ఆర్చీస్, హ్యామ్లీస్, డబ్ల్యూహెచ్ స్మిత్ వంటి రిటైల్ స్టోర్స్ నుంచి 18,600 ఆటబొమ్మలను అధికారులు సీజ్ చేశారు. భారతీయ నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన బీఐఎస్ మార్కు లేకపోవడం, నకిలీ లైసెన్సులతో తయారు చేయడం తదితర అంశాలు ఇందుకు కారణం. బీఐఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ శుక్రవారం ఈ విషయాలు తెలిపారు. బీఐఎస్ ప్రమాణాలకు తగ్గట్లుగా లేని బొమ్మల విక్రయం జరుగుతోందంటూ దేశీ తయారీదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో దేశవ్యాప్తంగా గత నెలలో పెద్ద విమానాశ్రయాలు, మాల్స్‌లోని బడా రిటైలర్స్ స్టోర్స్‌లో 44 సోదాలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై తదితర విమానాశ్రాయాల్లో వేల కొద్దీ బొమ్మలను సీజ్ చేసినట్లు తెలిపారు. బీఐఎస్ చట్టం కింద నిబంధనల ఉల్లంఘనకు గాను రూ. 1 లక్ష జరిమానా మొదలుకుని జైలు శిక్ష వరకూ నేరం తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. -
ఆర్చీ కోరిక తీరింది...
ప్రతిష్ఠాత్మకమైన బ్యాగీ గ్రీన్ టోపీ అందుకున్నాడు... టాస్‌లోనూ పాల్గొన్నాడు... భారత్, ఆస్ట్రేలియా కెప్టెన్ల మధ్య తుది జట్ల జాబితా పంపకంలోనూ చేయేశాడు... మ్యాచ్‌పై తమ జట్టు దృక్పథం ఎలా ఉండబోతోందో విశ్లేషించాడు... మొత్తానికి ఆస్ట్రేలియా జాతీయ జట్టు కెప్టెన్ కావాలన్న తన కోరికను ఏడేళ్ల చిన్నారి ఆర్చీ షిల్లర్ తీర్చుకున్నాడు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న షిల్లర్‌ను ‘మేక్ ఏ విష్ ఆస్ట్రేలియా’ శాఖ కోరిక మేరకు మెల్బోర్న్ టెస్టుకు ఆస్ట్రేలియా కో–కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు ఆకుపచ్చ బ్లేజర్లో జాతీయ గీతాలాపన సహా మ్యాచ్ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. తన అభిమాన క్రికెటర్ నాథన్ లయన్ నుంచి బ్యాగీ గ్రీన్ టోపీ పొందిన షిల్లర్... ఇదంతా తన తల్లిదండ్రుల సమక్షంలోనే జరగడంతో మరింత ఆనందభరితుడయ్యాడు. ‘సిక్స్‌లు కొట్టండి... వికెట్లు తీయండి’ అంటూ చివరగా తమ జట్టు సభ్యులకు సందేశమిచ్చాడు. -
ఆర్చీల ఏర్పాటుతో ప్రజాధనం వృథా
–ప్రొటోకాల్‌కు తూట్లు పొడుస్తున్న ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం ఈఓ – ఆయనపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తా– ఆదోని ఎమ్మెల్యే ఆదోని టౌన్: ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్సవాల పేరుతో ఆలయ ఈఓ ఆదోని– ఉరుకుంద మార్గంలో ఇష్టం వచ్చినట్లు ఆర్చీలు ఏర్పాటు చేసి ప్రజధనాన్ని వృథా చేస్తున్నారని ఆదోని ఎమ్మెల్మే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దాదాపు వంద సంవత్సరాలుగా ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్సవాలు ఏటా శ్రావణమాసంలో జరుగుతాయని, రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితరప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారన్నారు. అయితే ఆలయ కమిటీ నిర్వాహకులు వారికి అవసరమైన ఏర్పాట్లపై దృష్టిసారించకుండా ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారని మండిపడ్డారు. ఆర్చీలకే ఏడాదికి దాదాపు రూ.15లక్షల మేర ఖర్చు చేస్తున్నారని చెప్పారు. ఆదోనిలో ఏర్పాటు చేసిన ఆర్చీలో ప్రొటోకాల్ పాటించలేదని, ఎమ్మెల్యేను కాదని ఎలాంటి హోదాలేని నాయకుల నిలువెత్తు ఫొటోలు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న ఆలయ ఈఓపై చీఫ్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు. సమావేశంలో పార్టీ పట్టణ కన్వీనర్ చంద్రకాంత్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డి, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రాముడు పాల్గొన్నారు.


