మరో ఇద్దరిపై వేటు | Another two are Avoided | Sakshi
Sakshi News home page

మరో ఇద్దరిపై వేటు

Jun 8 2015 1:41 AM | Updated on Oct 9 2018 6:36 PM

పదవిలోకి వచ్చిన తర్వాత శ్రీనివాసన్ సంబంధీకులను బోర్డు నుంచి సాగనంపుతున్న బీసీసీఐ కొత్త కార్యవర్గం తాజాగా మరో ఇద్దరిని తప్పించింది.

ముంబై : పదవిలోకి వచ్చిన తర్వాత శ్రీనివాసన్ సంబంధీకులను బోర్డు నుంచి సాగనంపుతున్న బీసీసీఐ కొత్త కార్యవర్గం తాజాగా మరో ఇద్దరిని తప్పించింది. శ్రీనివాసన్ సన్నిహితులుగా గుర్తింపు తెచ్చుకున్న టీమ్ లాజిస్టిక్ మేనేజర్ ఎంఏ సతీశ్, మీడియా మేనేజర్ ఆర్‌ఎన్ బాబాలను ఆ పదవుల నుంచి తొలగించింది. 2011 నుంచి మధ్యలో కొద్ది రోజులు మినహా సతీశ్... 2012 టి20 ప్రపంచకప్ నుంచి బాబా భారత జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నారు.

ఇప్పటి వరకు సతీశ్‌కు నెలకు రూ. 6 లక్షలు, బాబాకు ప్రతీ టూర్‌కు రూ. 5 లక్షల చొప్పున బోర్డు చెల్లించినట్లు సమాచారం. బంగ్లా పర్యటనకు సతీశ్ స్థానంలో రిషిక్ ఉపాధ్యాయను ఎంపిక చేయగా, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ బిశ్వరూప్ డే మీడియా మేనేజర్‌గా కూడా వ్యవహరిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement