వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆంధ్ర జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్‌తో జరిగిన రంజీ గ్రూప్ ‘బి’
సాక్షి, విజయనగరం: వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆంధ్ర జట్టు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా గుజరాత్‌తో జరిగిన రంజీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తమ తొలి మ్యాచ్‌లో పటిష్ట ముంబైపై కూడా ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆదివారం నాలుగో రోజు ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 24/1 ఓవర్‌నైట్ స్కోరుతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన గుజరాత్ రోజు ముగిసే సమయానికి 90 ఓవర్లలో నాలుగు వికెట్లకు 254 పరుగులు చేసింది. అంతకుముందు గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 308 పరుగులు చేయగా ఆంధ్ర 421 పరుగులకు ఆలౌటయ్యింది. దీంతో 113 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
హైదరాబాద్‌కు మరోసారి నిరాశ
సాక్షి, హైదరాబాద్: అనుకున్నట్టుగానే హైదరాబాద్ జట్టుకు మరోసారి నిరాశ ఎదురైంది. కేరళతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయిన ఈ జట్టు ఒక్క పాయింట్‌తోనే సరిపెట్టుకుంది.