పతకానికి విజయం దూరంలో... | Amit, Gaurav enter quarterfinals of World Boxing Championships | Sakshi
Sakshi News home page

పతకానికి విజయం దూరంలో...

Aug 29 2017 1:18 AM | Updated on Sep 17 2017 6:03 PM

పతకానికి విజయం దూరంలో...

పతకానికి విజయం దూరంలో...

ప్రపంచ సీనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అమిత్‌ ఫంగల్‌(49 కేజీలు),

♦  క్వార్టర్‌ ఫైనల్లో అమిత్, గౌరవ్‌
♦  వికాస్, సుమీత్‌లకు చుక్కెదురు


హాంబర్గ్‌ (జర్మనీ): ప్రపంచ సీనియర్‌ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అమిత్‌ ఫంగల్‌(49 కేజీలు), గౌరవ్‌ బిధురి(56 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... వికాస్‌ కృషన్‌(75 కేజీలు), సుమీత్‌ సాంగ్వాన్‌(91 కేజీలు), మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు), శివ థాపా(60 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించారు. ఏడో సీడ్‌ కార్లోస్‌ కిపో (ఈక్వెడార్‌)తో జరిగిన బౌట్‌లో అమిత్‌ 5–0తో సంచలన విజయం సాధించగా... గౌరవ్‌ 4–1తో మికోలా బుత్సెంకో (ఉక్రెయిన్‌)ను ఓడించాడు.

మరో విజయం సాధిస్తే అమిత్, గౌరవ్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. మరోవైపు 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత వికాస్‌ 0–5తో విటేకర్‌ (ఇంగ్లండ్‌) చేతిలో, సుమీత్‌ 2–3తో జాసన్‌ వాటెలె (ఆస్ట్రేలియా) చేతిలో, మనోజ్‌ కుమార్‌ 1–4తో గాబ్రియెల్‌ పెరెజ్‌(వెనిజులా) చేతిలో ఓడిపోయారు. ఒటార్‌ ఎరానోసియాన్‌(జార్జియా)తో తలపడా ల్సిన శివ థాపా తీవ్ర జ్వరం కారణంగా బరిలోకి దిగకుండానే తన ప్రత్యర్థికి వాకోవర్‌ ఇచ్చాడు. 

Advertisement
 
Advertisement
Advertisement