‘సెహ్వాగ్‌ కంటే రోహితే చాలా బెటర్‌’

Akhtar Says Rohit Has Better Technique Than Sehwag - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టెస్టు ఓపెనర్‌గా అరంగేట్రపు మ్యాచ్‌లోనే రెండు శతకాలతో 303 పరుగులు చేసి రికార్డుల మీద రికార్డులు నెలకొల్పాడు టీమిండియా హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ, ఇప్పటివరకు పరిమిత ఓవర్ల క్రికెటర్‌గా ఉన్న అపవాదును ఒక్క టెస్టుతోనే తొలగించుకున్నాడు. టెస్టుల్లోనే రో‘హిట్టు’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. విశాఖపట్నం టెస్టులో రోహిత్‌ ఆటకు ఫ్యాన్స్‌ అయిన కొంత మంది మాజీ క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ఓ అడుగుముందుకేసి 2013లోనే రోహిత్‌ గ్రేట్‌ బ్యాట్స్‌మన్‌ అవుతాడని చెప్పానని గుర్తుచేశాడు. అంతేకాకుండా రోహిత్‌ భారత ఇంజమాముల్‌ హక్‌ అంటూ పోల్చాడు. ఇక టెక్నిక్‌ విషయంలో వీరేంద్ర సెహ్వాగ్‌ కంటే రోహిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ బాగుంటుందని అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. 

‘2013లో బంగ్లాదేశ్‌లో ఓ జిమ్‌లో రోహిత్‌ను కలిశాను. అప్పుడు నీపేరేంటని అడిగా. రోహిత్‌ అని సమాధానమిచ్చడు. వెంటనే త్వరలో నీ పేరు ముందు గ్రేట్‌ అనే పదం చేరుతుంది. అని చెప్పా. ఇప్పుడు స్పష్టమైంది. ఆలోచన దోరణిలో, షాట్ల ఎంపికలో టీమిండియాలో రోహిత్‌ కంటే బెటర్‌ బ్యాట్స్‌మన్‌ లేడనే భావన అప్పుడూ.. ఇప్పుడూ ఉంది. ఇక బ్యాటింగ్‌ టెక్నిక్‌ విషయంలో సెహ్వాగ్‌ కంటే రోహిత్‌ చాల బెటర్‌. సెహ్వాగ్‌ మైదానం నలువైపులా బంతిని పంపించేలా దూకుడుగా ఆడగలడు. కానీ రోహిత్‌ షాట్ల ఎంపికలో వైవిధ్యం ఉంటుంది. రోహిత్‌ భారత ఇంజమాముల్‌ హక్‌. ఇక టెస్టుల్లో ఓపెనర్‌గా రోహిత్‌ రావడంతో టీమిండియాలో పోటీ పెరిగింది. కాగా, అతి త్వరలోనే అన్ని ఫార్మట్లలో రోహిత్‌ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌గా నిలవడం ఖాయం’అంటూ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top