భారత్‌ క్రికెట్‌కు గొప్ప సేవకుడు..

Ajit wadekar great servant of Indian Cricket, Sehwag - Sakshi

న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న  భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, సెలక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అజిత్‌ వాడేకర్‌ (77) బుధవారం కన్నుమూశారు. అజిత్‌ వాడేకర్‌ మృతి పట్ల రాష్ట్రపతితో పాటు పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమైన వార్త అని, భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన గొప‍్ప ఆటగాళ్లలో వాడేకర్‌ ఒకరని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు.

క్రికెటర్, కెప్టెన్‌, కోచ్‌, మేనేజర్‌, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా సేవలందించిన వాడేకర్‌ చాలా అరుదైన వ్యక్తిగా మాజీ క‍్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. భారత క్రికెట్‌కు గొప్ప సేవకుడు వాడేకర్‌ సర్‌ అని కొనియాడాడు. ‘ఓం శాంతి అజిత్‌ వాడేకర్‌ సర్‌’ అంటూ ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. భారత్‌కు చారిత్రక విజయాలు అందించిన మాజీ  కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌ ఇక లేరన్న వార్త తనను ఎంతగానో కలచి వేసిందంటూ సురేశ్‌ రైనా పేర్కొన్నాడు. ఆయన కుటుంబ సభ్యులకు రైనా సంతాపం తెలియజేశారు.

అజిత్‌ వాడేకర్‌ కన్నుమూత

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top