30 ఏళ్ల నిరీక్షణకు తెర

After Thirty Years Liverpool As English Premier League Champions - Sakshi

ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ చాంపియన్‌గా లివర్‌పూల్‌

లండన్‌: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా 30 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) తెరదించింది. ప్రతిష్టాత్మక ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌) 2019–2020 సీజన్‌ చాంపియన్‌గా ఆవిర్భవించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ మాంచెస్టర్‌ సిటీ జట్టు శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 1–2 గోల్స్‌తో చెల్సీ ఎఫ్‌సీ చేతిలో ఓడటంతో లివర్‌పూల్‌ టైటిల్‌ కల సాకారమైంది. టైటిల్‌ రేసులో నిలవాలంటే ఓటమి తప్పించుకోవాల్సిన మ్యాచ్‌లో మాంచెస్టర్‌ సిటీ ఓడిపోవడంతో కరోనా విరామం అనంతరం బరిలోకి దిగకుండానే లివర్‌పూల్‌కు టైటిల్‌ లభించింది.

ఈ సీజన్‌లో ఈపీఎల్‌లో ఉన్న 20 జట్లకు తలా ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగా... లివర్‌పూల్‌ 86 పాయింట్లు, మాంచెస్టర్‌ సిటీ 63 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన ఏడు మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా పాయింట్ల పట్టికలో లివర్‌పూల్‌ను ఏ జట్టూ అందుకునే పరిస్థితి లేకపోవడంతో ఆ జట్టుకు టైటిల్‌ ఖాయమైంది. 1989–90 సీజన్‌లో చివరిసారిగా లివర్‌ఫూల్‌ విజేతగా నిలిచింది. ఈపీఎల్‌ చరిత్రలో ఓ జట్టు ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే చాంపియన్‌గా అవతరించడం ఇదే తొలిసారి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top