అఫ్గానిస్తాన్‌దే సిరీస్‌ 

Afghanistan won by two runs against Scotland - Sakshi

ఎడిన్‌బర్గ్‌: పరుగుల ప్రవాహానికి వర్షం అడ్డుపడిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్‌) పద్ధతిలో రెండు పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై గెలిచింది. రెండు వన్డేల సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. ముందుగా స్కాట్లాండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసింది. మెక్‌లియోడ్‌ (100; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. అఫ్గాన్‌ బౌలర్లలో నైబ్‌ 3, అఫ్తాబ్, హమీద్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత  అఫ్గానిస్తాన్‌ వర్షంతో ఆటనిలిచే సమయానికి 44.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రహ్మత్‌ షా (115 బంతుల్లో 113; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతక్కొట్టాడు. అనంతరం మ్యాచ్‌ కొనసాగకపోవడంతో అఫ్గాన్‌ డీఎల్‌ ప్రకారం 2 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు. తొలి వన్డే వర్షంతో రద్దయింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top