డివిలియర్స్‌ షాకింగ్‌ వీడియో వైరల్‌..

AB De Villiers Went For A Ride In Auto Rickshaw With His Family Then What Happened - Sakshi

బెంగుళూరు : దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌కు మన దేశంలో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రసుత ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తరుఫున బరిలోకి దిగాడు డివిలియర్స్‌. బుధవారం  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం డివిలియర్స్‌ తన భార్య, కుమారునితో కలిసి ఆటోలో షికారుకు బయలుదేరాడు.

ఆటో రిక్షాలో ఉన్న డివిలియర్‌ను గమనించిన అభిమానులు ‘ఈ సాలా కప్‌ నమ్డే’ అని నినాదాలు చేస్తూ డివిలియర్‌ ప్రయాణిస్తున్న ఆటోను  వెంబడించారు. ‘ఈ సాలా కప్‌ నమ్డే’ అనేది ఈ ఐపీఎల్‌లో సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ నినాదం. ఈ ఆదివారం చిన్నస్వామీ స్టేడియంలో జరగునున్న మ్యాచ్‌లో బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top