అది డివిలియర్స్‌కు తెలియదు: కోహ్లి | AB de Villiers helped me improve my game in South Africa, says Virat Kohli | Sakshi
Sakshi News home page

అది డివిలియర్స్‌కు తెలియదు: కోహ్లి

Apr 19 2018 8:54 PM | Updated on Apr 27 2018 11:00 AM

AB de Villiers helped me improve my game in South Africa, says Virat Kohli - Sakshi

బెంగళూరు: ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఒకడు. అయితే దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ ఏబీ డివిలియర్స్‌ బ్యాటింగ్‌తో కొన్ని మెలకువలు నేర్చుకున్నట్లు కోహ్లి తాజాగా స్పష్టం చేశాడు. ప్రధానంగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన సమయంలో డివిలియర్స్‌ బ్యాటింగ్‌ ద్వారా ఎంతో నేర్చుకున్నానని కోహ్లి తెలిపాడు. అయితే ఈ విషయం డివిలియర్స్‌కు ఇప్పటివరకూ తెలియదన్నాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)కి ఆడుతున్న క్రమంలో కోహ్లి కొన్ని విషయాల్ని షేర్‌ చేసుకున్నాడు.

‘జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఇరు జట్ల మధ్య కేప్‌టౌన్‌ వేదికగా తొలి టెస్టు జరిగింది. ఈ టెస్టులో నేను రెండు ఇన్నింగ్సల్లో కలిపి 33 పరుగులు మాత్రమే చేశాను. ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమయ్యాను. కానీ, తిరిగి పుంజుకోవడం ఎలా అని ఆలోచించాను. ఆ సమయంలో డివిలియర్స్‌ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టా.  బుమ్రా వేసే బంతులను డివిలియర్స్‌ ఎలా ఎదుర్కొంటున్నాడో జాగ్రత్తగా పరిశీలించాలనుకున్నాను. అదే చేశాను. అతని టెక్నిక్‌ తెలిసింది. బౌలర్‌ వేసే బంతి బ్యాట్‌ అంచును తాకకుండా ఎలా కొట్టాలో డివిలియర్స్‌ ఆడుతుంటే చూసి నేర్చుకున్నా. ఆ తర్వాత రెండు టెస్టుల్లో ఆ వ్యూహాన్నే అమలు చేసి విజయవంతమయ్యా. ఈ సీక్రెట్‌ ఇప్పటి వరకు డివిలియర్స్‌కు కూడా చెప్పలేదు’ అని కోహ్లి తెలిపాడు. సెంచూరియన్‌, జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టుల్లో కోహ్లి విశేషంగా రాణించాడు.. ఈ రెండు టెస్టుల్లో కలిపి కోహ్లి 253 పరుగులు సాధించాడు. రెండో టెస్టులో కోహ్లి(153) శతకం సాధించగా, మూడో టెస్టులో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. ఇక వన్డే సిరీస్‌లో మూడు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీని పరుగుల మెషీన్‌ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement