విష్ణువర్ధన్‌కు 31వ డబుల్స్‌ టైటిల్‌ | 31 doubles title to Vishnuvardhan's | Sakshi
Sakshi News home page

విష్ణువర్ధన్‌కు 31వ డబుల్స్‌ టైటిల్‌

Mar 4 2017 1:24 AM | Updated on Sep 5 2017 5:06 AM

విష్ణువర్ధన్‌కు 31వ డబుల్స్‌ టైటిల్‌

విష్ణువర్ధన్‌కు 31వ డబుల్స్‌ టైటిల్‌

హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ తన ఖాతాలో 31వ డబుల్స్‌ టైటిల్‌ను జమ చేసుకున్నాడు.

గువహటి: హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ తన ఖాతాలో 31వ డబుల్స్‌ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. శుక్రవారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) ఫ్యూచర్స్‌–3 టోర్నమెంట్‌లో తన భాగస్వామి శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)తో కలిసి విష్ణు టైటిల్‌ దక్కించుకున్నాడు.

పురుషుల డబుల్స్‌ ఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం 4–6, 6–1, 10–5తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో శశికుమార్‌ ముకుంద్‌ (భారత్‌)–తిముర్‌ ఖాబిబులిన్‌ (కజకిస్తాన్‌) జోడీపై గెలిచింది. సింగిల్స్‌ విభాగంలో మాత్రం విష్ణువర్ధన్‌ సెమీఫైనల్లో ఓడిపోయాడు. శశికుమార్‌ ముకుంద్‌తో జరిగిన మ్యాచ్‌లో విష్ణు 3–6, 6–4, 1–6తో పరాజయం పాలయ్యాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement