విషాదం : 19 ఏళ్ల బాక్సర్ ఆత్మహత్య

ముంబై : మహారాష్ట్రలోని అకోలాలో జాతీయస్థాయి యువ బాక్సర్ పవన్ రౌత్(19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అకోలాలో తన హాస్టల్ గదిలో శుక్రవారం ఉదయం పవన్ రౌత్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని కోచ్ సతీష్ చంద్ర భట్ తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ పోటీల్లో పవన్ రౌత్ మహారాష్ట్ర తరపున ప్రాతినిథ్యం వహించాడని కోచ్ సతీష్ చెప్పారు. నాగ్‌పూర్‌కు చెందిన పవన్ రౌత్ అకోలాలోని స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతూనే అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. కాగా, శుక్రవారం అకోలోలానే జరిగే ఒక టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉండగా.. అతడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అనారోగ్యంతో పవన్ రౌత్ శిక్షణకు రాలేదని, శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కోచ్ తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర క్రీడా మంత్రి సునీల్ కేదార్ విచారం వ్యక్తం చేశారు. పవన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు