తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌కు 17 పతకాలు | 17 medals to telangana sports school | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌కు 17 పతకాలు

Jul 8 2017 10:36 AM | Updated on Apr 7 2019 3:34 PM

తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌కు 17 పతకాలు - Sakshi

తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌కు 17 పతకాలు

ఇంటర్‌ క్లబ్‌ ఫెన్సింగ్‌ జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌) విద్యార్థులు సత్తా చాటారు.

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ క్లబ్‌ ఫెన్సింగ్‌ జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌) విద్యార్థులు సత్తా చాటారు. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో 17 పతకాలను సాధించారు. స్పోర్ట్స్‌ స్కూల్‌ నుంచి ఈ టోర్నీలో 18 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో 17 మంది పతకాలను గెలుచుకోవడం విశేషం. టీఎస్‌ఎస్‌ఎస్‌ 5 స్వర్ణాలు, 2 రజతాలు, 10 కాంస్యాలను కైవసం చేసుకుంది.

 

అండర్‌–17 విభాగంలో వై. మురళి పసిడి, కాంస్య పతకాలను గెలుచుకోగా, అండర్‌–14 కేటగిరీలో గౌరీ స్వర్ణాన్ని సాధించింది. అండర్‌–14 విభాగంలో వై. మురళీ, ఏ. శిరీష రజతాలను గెలుచుకున్నారు. వీరితో పాటు అండర్‌–17 విభాగంలో లోకేశ్, చందు, పవన్‌ కల్యాణ్, బేబీ రెడ్డి, జి. శిరీష, విష్ణు ప్రియ, శివాని కాంస్యాలను సాధించారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement