breaking news
TSSS
-
యూకేలో శిక్షణకు టీఎస్‌ఎస్‌ఎస్ అథ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్‌ఎస్‌ఎస్)కు చెందిన ముగ్గురు అథ్లెట్లకు గొప్ప అవకాశం లభించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లాబరో యూనివర్సిటీ అందించే అత్యుత్తమ అథ్లెటిక్స్ శిక్షణకు వీరు ఎంపికయ్యారు. టీఎస్ఎస్ఎస్లో ఇంటర్ చదువుతోన్న వై. హరికృష్ణ, కె. అరవింద్, పదో తరగతి విద్యార్థిని డి. భాగ్యలక్ష్మి ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. వీరు ఇటీవలే జరిగిన టాటా టీ జాగోరే ‘జాతీయ అథ్లెటిక్స్’లో మెరుగైన ప్రతిభ కనబరిచి ఈ శిక్షణకు అర్హత సాధించారు. యూకేలో ఏప్రిల్‌లో 8 రోజుల పాటు కోచింగ్ క్యాంపు జరుగుతుంది. దేశవ్యాప్తంగా 12 మంది అథ్లెట్లు ఈ క్యాంపునకు ఎంపికవగా టీఎస్‌ఎస్‌ఎస్ విద్యార్థులే ముగ్గురు ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా టీఎస్‌ఎస్‌ఎస్ ఓఎస్డీ కె. నర్సయ్య, అథ్లెటిక్స్ కోచ్ పీబీ ఆదిత్య, క్రీడాధికారి ఆర్కే బోస్ విద్యార్థులను అభినందించారు. -
విజేతలు శ్రీకాంత్, దుర్గ
సాక్షి, హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ (ఆర్‌ఎఫ్‌వైఎస్) అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్‌ఎస్‌ఎస్) విద్యార్థులు సత్తా చాటారు. గచ్చిబౌలి స్డేడియంలో జరిగిన ఈ టోర్నీలో 17 ఈవెంట్లకు గానూ 8 టైటిళ్లను వారే గెలుచుకున్నారు. గురువారం జరిగిన సీనియర్ బాలుర 800మీ. పరుగులో డి. శ్రీకాంత్ (టీఎస్‌ఎస్‌ఎస్) చాంపియన్‌గా నిలిచాడు. అతను లక్ష్యదూరాన్ని 2 నిమిషాల 0.18 సెకన్లలో పూర్తిచేశాడు. 4/400మీ. రిలేలోనూ శ్రీకాంత్ సభ్యునిగా ఉన్న టీఎస్‌ఎస్‌ఎస్ బృందం విజేతగా నిలిచింది. సీనియర్ బాలికల లాంగ్‌జంప్‌లో వి. దుర్గ (టీఎస్‌ఎస్‌ఎస్) 4.31మీ. దూరం జంప్ చేసి టైటిల్‌ను గెలుపచుకోగా, శ్రీకీర్తి (భారతీయ విద్యాభవన్), కసక్ విజయవర్గీ (సెయింట్ జోసెఫ్) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు సీనియర్ బాలురు: 800మీ.: 1. డి. శ్రీకాంత్ (టీఎస్‌ఎస్‌ఎస్), 2. దుర్గా రావు (టీఎస్‌ఎస్‌ఎస్), వంశీకృష్ణ (జయచంద్ర). 4/400మీ. రిలే: 1. టీఎస్‌ఎస్‌ఎస్, 2. భవన్స్ జూ. కాలేజి, 2. విజ్ఞాన్ విద్యాలయ. హైజంప్: 1.పట్లోళ్ల రెడ్డి, 2. సతీశ్, 3. కృతరిత్ పటేల్. ట్రిపుల్ జంప్: 1. శామ్యూల్స్, 2. పట్లోళ్ల రెడ్డి, 3. హృషి. సీనియర్ బాలికలు: 400మీ.: 1. సప్నా రావత్, 2. అంజలి, 3. శ్రీలక్ష్మి. 800మీ.: 1. ధరణి (టీఎస్‌ఎస్‌ఎస్), 2. తరిణి (భవన్స్), 3. జెస్సికా. 4/400మీ.: 1. భవన్స్ అరబిందో, 2. కస్తూర్బా కాలేజి, 3. సెయింట్ ఫ్రాన్సిస్. జూనియర్ బాలురు: 800మీ.: 1. దేముడు నాయుడు (టీఎస్‌ఎస్‌ఎస్), సతీశ్ (టీఎస్‌ఎస్‌ఎస్), ప్రకాశ్ (టీఎస్‌ఎస్‌ఎస్). హైజంప్: 1. గోపాలకృష్ణ (టీఎస్‌ఎస్‌ఎస్), తేజ, 3. కార్తీక్. ట్రిపుల్‌జంప్: 1. కపిల్ సూర్య, 2. సూర్య (డీపీఎస్), 3. పి. వెంకటేశ్. జూనియర్ బాలికలు: 800మీ.: 1. భాగ్యలక్ష్మి (టీఎస్‌ఎస్‌ఎస్), 2. ఎం. భారతి (టీఎస్‌ఎస్‌ఎస్). 4/400మీ. రిలే: 1. సెయింట్ మార్క్స్ బాయ్స్టౌన్, 2. సాయ్ స్కూల్, 3. జిల్లా పరిషత్ హైస్కూల్. లాంగ్ జంప్: 1. టి. అనిత (టీఎస్‌ఎస్‌ఎస్), 2. ఎం. భారతి (టీఎస్‌ఎస్‌ఎస్), 3. మాధురి (జాన్సన్ గ్రామర్ స్కూల్). -
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌కు 17 పతకాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ క్లబ్ ఫెన్సింగ్ జాతీయ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ (టీఎస్‌ఎస్‌ఎస్) విద్యార్థులు సత్తా చాటారు. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో 17 పతకాలను సాధించారు. స్పోర్ట్స్ స్కూల్ నుంచి ఈ టోర్నీలో 18 మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో 17 మంది పతకాలను గెలుచుకోవడం విశేషం. టీఎస్‌ఎస్‌ఎస్ 5 స్వర్ణాలు, 2 రజతాలు, 10 కాంస్యాలను కైవసం చేసుకుంది. అండర్–17 విభాగంలో వై. మురళి పసిడి, కాంస్య పతకాలను గెలుచుకోగా, అండర్–14 కేటగిరీలో గౌరీ స్వర్ణాన్ని సాధించింది. అండర్–14 విభాగంలో వై. మురళీ, ఏ. శిరీష రజతాలను గెలుచుకున్నారు. వీరితో పాటు అండర్–17 విభాగంలో లోకేశ్, చందు, పవన్ కల్యాణ్, బేబీ రెడ్డి, జి. శిరీష, విష్ణు ప్రియ, శివాని కాంస్యాలను సాధించారు.