విజేతలు శ్రీకాంత్, దుర్గ

Srikanth, Durga got titles in rfys athletics meet - Sakshi

ఆర్‌ఎఫ్‌వైఎస్‌ అథ్లెటిక్స్‌ మీట్‌

సాక్షి, హైదరాబాద్‌: రిలయన్స్‌ ఫౌండేషన్‌ యూత్‌ స్పోర్ట్స్‌ (ఆర్‌ఎఫ్‌వైఎస్‌) అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌) విద్యార్థులు సత్తా చాటారు. గచ్చిబౌలి స్డేడియంలో జరిగిన ఈ టోర్నీలో 17 ఈవెంట్లకు గానూ 8 టైటిళ్లను వారే గెలుచుకున్నారు. గురువారం జరిగిన సీనియర్‌ బాలుర 800మీ. పరుగులో డి. శ్రీకాంత్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌) చాంపియన్‌గా నిలిచాడు. అతను లక్ష్యదూరాన్ని 2 నిమిషాల 0.18 సెకన్లలో పూర్తిచేశాడు. 4/400మీ. రిలేలోనూ శ్రీకాంత్‌ సభ్యునిగా ఉన్న టీఎస్‌ఎస్‌ఎస్‌ బృందం విజేతగా నిలిచింది. సీనియర్‌ బాలికల లాంగ్‌జంప్‌లో వి. దుర్గ (టీఎస్‌ఎస్‌ఎస్‌) 4.31మీ. దూరం జంప్‌ చేసి టైటిల్‌ను గెలుపచుకోగా,  శ్రీకీర్తి (భారతీయ విద్యాభవన్‌), కసక్‌ విజయవర్గీ (సెయింట్‌ జోసెఫ్‌) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.  

ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు

 సీనియర్‌ బాలురు: 800మీ.: 1. డి. శ్రీకాంత్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌), 2. దుర్గా రావు (టీఎస్‌ఎస్‌ఎస్‌), వంశీకృష్ణ (జయచంద్ర).
4/400మీ. రిలే: 1. టీఎస్‌ఎస్‌ఎస్, 2. భవన్స్‌ జూ. కాలేజి, 2. విజ్ఞాన్‌ విద్యాలయ.
 
హైజంప్‌: 1.పట్లోళ్ల రెడ్డి, 2. సతీశ్, 3. కృతరిత్‌ పటేల్‌.  ట్రిపుల్‌ జంప్‌: 1. శామ్యూల్స్, 2. పట్లోళ్ల రెడ్డి, 3. హృషి.  సీనియర్‌ బాలికలు: 400మీ.: 1. సప్నా రావత్, 2. అంజలి, 3. శ్రీలక్ష్మి.  800మీ.: 1. ధరణి (టీఎస్‌ఎస్‌ఎస్‌), 2. తరిణి (భవన్స్‌), 3. జెస్సికా.  4/400మీ.: 1. భవన్స్‌ అరబిందో, 2. కస్తూర్బా కాలేజి, 3. సెయింట్‌ ఫ్రాన్సిస్‌.  జూనియర్‌ బాలురు: 800మీ.: 1. దేముడు నాయుడు (టీఎస్‌ఎస్‌ఎస్‌), సతీశ్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌), ప్రకాశ్‌ (టీఎస్‌ఎస్‌ఎస్‌).  హైజంప్‌: 1. గోపాలకృష్ణ (టీఎస్‌ఎస్‌ఎస్‌), తేజ, 3. కార్తీక్‌.  ట్రిపుల్‌జంప్‌: 1. కపిల్‌ సూర్య, 2. సూర్య (డీపీఎస్‌), 3. పి. వెంకటేశ్‌.  జూనియర్‌ బాలికలు: 800మీ.: 1. భాగ్యలక్ష్మి (టీఎస్‌ఎస్‌ఎస్‌), 2. ఎం. భారతి (టీఎస్‌ఎస్‌ఎస్‌).  4/400మీ. రిలే: 1. సెయింట్‌ మార్క్స్‌ బాయ్స్‌టౌన్, 2. సాయ్‌ స్కూల్, 3. జిల్లా పరిషత్‌ హైస్కూల్‌.   లాంగ్‌ జంప్‌: 1. టి. అనిత (టీఎస్‌ఎస్‌ఎస్‌), 2. ఎం. భారతి (టీఎస్‌ఎస్‌ఎస్‌), 3. మాధురి (జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌).

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top