హాట్‌ టాపిక్‌గా రాయల్‌ కపుల్‌ డాన్స్‌ | Twitter reacts to Virat,Anushka Sharma wedding reception in Delhi | Sakshi
Sakshi News home page

హాట్‌ టాపిక్‌గా రాయల్‌ కపుల్‌ డాన్స్‌

Dec 22 2017 1:10 PM | Updated on Dec 22 2017 1:22 PM

Twitter reacts to Virat,Anushka Sharma wedding reception in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీః   ప్రేమ- పెళ్లి వార్తలో నిత్యం హెడ్‌ లైన్స్‌లో నిలుస్తున్న విరుష్క  జోడీ వెడ్డింగ్‌  రిసెప్షన్‌లో కూడా సందడి చేశారు. జహీర్‌ పెళ్లిలో  కలర్‌ఫుల్‌గా డాన్స్‌ చేసిన ఈ జంట తమ పెళ్లి రిసెప్షన్లో  మరింత అదరగొట్టి హాట్‌ టాపిక్‌ గా నిలిచారు.   అదిరిపోయే కాస్టూమ్స్‌తో రాయల్ లుక్‌లో కనిపించిన వీళ్లిద్దరూ అంతే హుషారుగా  స్టెప్పులేశారు. పంజాబీ మ్యూజిక్‌ కు  జోరుగా  చిందేసిన విరుష్క జోడీ తాజా డాన్స్‌ క్లిప్‌తో  సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది.

ఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో గురువారం రాత్రి వెడ్డింగ్ రిసెప్షన్ తర్వాత  పంజాబీ ట్యూన్స్‌కు చిందేశారు.  ఈ సెలబ్రిటీ జోడీ ఇచ్చిన రిసెప్షన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతోపాటు క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనా, గంభీర్ హాజరయ్యారు. ముఖ్యంగా నోట్లో ఓ కరెన్సీ నోటుతో అనుష్క చేసిన డ్యాన్స్ హైలైట్. విరాట్‌తోపాటు ధావన్‌తో కలిసి నుష్కీ స్టెప్పులేసింది.  ఇక డిసెంబర్‌ 26న  ముంబైలో రెండవ రిసెప్షన్‌లో మరెంత సందడి చేయనున్నారో.. మరోవైపు రాయల్‌ కపుల్‌  వెడ్డింగ్‌ రిసెప్షన్‌పై ట్విట్టర్‌లో అభినందనలు  వెల్లువెత్తాయి.
కాగా ఈ ఏడాది నవంబర్‌లో జరిగిన జహీర్, సాగరిక ఘాట్గె రిసెప్షన్ లో కోహ్లీ-అనుష్క మ్యాచింగ్ డ్రస్‌తో హాజరై ఆ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతోపాటు ఉత్సాహంగా స్టెప్స్ వేస్తూ అదరగొట్టిన సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement