సూపర్‌స్టార్‌ @ 78

Rajinikanth tops the list of 100 most powerful Indians from South India - Sakshi

సాక్షి,సినిమా: దేశంలో శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో నటుడు రజనీకాంత్‌ 78వ స్థానంలో నిలిచారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక సర్వే నిర్వహించి ఇండియాలోని 100 మంది శక్తివంతమైన వ్యక్తుల జాబితాను ఇటీవల వెల్లడించింది. అందులో మొదటి స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ, ద్వితీయ స్థానంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, తృతీయ స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా, నాల్గవ స్థానంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పార్టీ నేత మోహన్‌ భగవాత్‌ నిలిచారు. ఈ జాబితాలో నటుడు రజనీకాంత్‌కు 78వ స్థానం లభించింది. రాజకీయరంగ ప్రవేశానికి సిద్ధమైన రజనీకి పరపతి పెరిగినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top