'ఇలాంటి వారిని విమానం ఎందుకు ఎక్కనిస్తారో'

Video Of Man Punching Woman Reclined Seat Continuously Goes Viral - Sakshi

మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది ప్రయాణికులు వారి చేష్టలతో విసుగు తెప్పింస్తుంటారు. అలాంటి వారిని చూస్తే ఎవరికైనా చికాకు కలగడం సహజం. తాజాగా అమెరికన్‌ ఎయిర్‌ప్లైట్‌లో ఒక వ్యక్తి తన చేష్టలతో ముందు సీటులో కూర్చున్న మహిళకు ఇబ్బంది కలిగించడం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 1.45 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఒక వ్యక్తి మహిళ కూర్చున్న ముందు సీటును అదేపనిగా తన చేతులతో పంచ్‌లు కొడుతూ చికాకు కలిగించాడు. అయితే మహిళ మాత్రం అతని చేష్టలతో ఏమాత్రం విసుగు చెందకుండా కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసినా అతన్ని ఏమనకుండా అలాగే మిన్నకుండిపోయింది. అయితే ఇదంతా మహిళ పక్కనే కూర్చున్న అమైకా అలీ అనే యువతి వీడియో తీసి తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

'అతని చేష్టలు చిన్నపిల్లాడిని గుర్తుచేస్తున్నాయి. వేరేవాళ్ల సంగతేమో కానీ నాకు మాత్రం అతని చేసిన పని న్యూసెన్స్‌గా అనిపించింది. అయితే నా పక్కనున్న మహిళ మాత్రం అతన్ని ఏమనకుండా అలాగే ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉంది' అంటూ క్యాప్షన్‌ పెట్టారు. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తూ..'ఇలాంటి వారిని ఫ్లైట్‌ ఎందుకు ఎక్కనిస్తారు... అతని చేష్టలు చిన్నపిల్లాడిని తీరును తలపిస్తుంది... ఆ వ్యక్తి అంతగా చికాకు పెడుతున్నా మహిళ ఏమనకపోవడం ఆమె నిబద్ధతకు నిదర్శనం' అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top