విమానంలో తల్లికి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొడుకు.. వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

విమానంలో తల్లికి స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కొడుకు.. వీడియో వైరల్‌

Published Mon, Oct 16 2023 1:10 PM

Pilot Son Surprises Mother Onboard Dubai Kochi Flight - Sakshi

అమ్మను స్కూటర్‌లో కూచోబెట్టి తిప్పేవాళ్లున్నారు. కార్లలో తిప్పేవాళ్లున్నారు. కాని విమానంలో తిప్పేవాళ్లు... అదీ విమానం నడుపుతూ తిప్పేవాళ్లు కొంచెం అరుదు. ఈ తల్లికి తన కుమారుడే తను ప్రయాణిస్తున్న ఫ్లయిట్‌కి పైలెట్‌ అని తెలియదు. కాని తెలిసి గొప్పగా  ఆనందించింది. మురిసిపోయింది. నెటిజన్లు కూడా భలే ముచ్చటపడ్డారు.

అది ఇండిగో విమానం. కొచ్చి నుంచి బయలుదేరబోతోంది. ఒకామె అదే ఫ్లయిట్‌లో చాలా క్యాజువల్‌గా ఎక్కింది. ఇంతలో ‘అమ్మా’ అనే పిలుపు. తిరిగి చూస్తే కాక్‌పిట్‌ నుంచి బయటికొచ్చి నిలబడిన పైలెట్‌. ‘హార్ని.. నువ్వేనా’ అని ఆమె సంబరంగా నోరు తెరిచేసింది. ఎందుకంటే ఆ పైలెట్‌ ఆమె కొడుకే. అతని పేరు విమల్‌ శశిధరన్‌. తను ప్రయాణించే ఫ్లయిట్‌కి కొడుకే పైలెట్‌ అని తెలిసిన తల్లి సంతోషంగా కొడుకును హగ్‌ చేసుకుంది.

ఆ స్వీట్‌ సర్‌ప్రయిజ్‌కి మురిసిపోయింది. కొచ్చికి చెందిన విమల్‌ శశిధరన్‌ ఇదంతా వీడియో తీయించి ఇన్‌స్టాలో ΄ోస్ట్‌ చేశాడు. ‘ఇలాంటి క్షణాలే జీవితాన్ని అత్యధ్భుతం చేస్తాయి’ అని కామెంట్‌ చేశాడు. ఆ వీడియోలో కన్నకొడుకు ఉన్నతి చూసి గర్వపడే తల్లిని, తల్లిని ఆనందపరిచే కొడుకును చూసి నెట్‌లోకం పులకించింది.

కామెంట్లు, లైక్‌లు మామూలే. ‘మీ అమ్మ వయసులో చిన్నదిగా కనిపిస్తోంది. పిల్లలు బాగా చూసుకుంటే తల్లిదండ్రుల వయసు తగ్గుతుంది’ అని ఒకరు రాస్తే ‘ఆ అమ్మ నవ్వు ఎంత బాగుంది’ అని మరొకరు రాశారు. ఏమైనా అమ్మను విమానంలో కూచోబెట్టి తానే నడిపి తిప్పే అదృష్టం ఎంతమందికొస్తుంది చెప్పండి.

Advertisement
 
Advertisement