సర్జికల్‌ స్ట్రైక్‌ : పాకిస్తాన్‌పై కుళ్లు జోకులు | Twitter Taken Over By Memes And Jokes Poking Fun at Pakistan After India Airstrikes | Sakshi
Sakshi News home page

సర్జికల్‌ స్ట్రైక్‌ : పాకిస్తాన్‌పై కుళ్లు జోకులు

Feb 26 2019 12:34 PM | Updated on Feb 26 2019 4:34 PM

Twitter Taken Over By Memes And Jokes Poking Fun at Pakistan After India Airstrikes - Sakshi

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా దాయాదీ దేశంపై కుళ్లు జోకులు పేలుతున్నాయి. పాక్‌ను టార్గెట్‌ చేస్తూ భారత నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌, ట్వీట్స్‌, వీడియోలను ట్రెండ్‌ చేస్తున్నారు. #Surgicalstrike2,  #Balakot, #IndiaStrikesBack, #IndianAirForce #airstrike యాష్‌ ట్యాగ్‌లతో పాక్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత సైన్యం జరిపిన దాడులకు పాక్‌ తోక ముడిచిందని, భయంతో చేతులెత్తిందని, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు అయితే జ్వరం పట్టుకుందని కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఈ దాడులపై క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం భారత వైమానిక దళాన్ని కొనియాడుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్‌లో భారత వైమానిక దళం మెరుపుదాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.  12 మిరాజ్‌-200 జైట్‌ ఫైటర్స్‌తో భారత వాయిసేన సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement