సోషల్‌ మీడియా

Opinion On Social Media - Sakshi

అశ్రు నివాళి
‘‘çనందమూరి హరికృష్ణగారి హఠాన్మరణ వార్త బాగా కలిచివేసింది. దిగ్భ్రాంతి కలిగించింది కూడా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ విపత్కర సమయంలో ఇంతటి విషాదాన్ని తట్టుకునే శక్తి నా సోదరుడు తారక్‌కి, ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’’ – మహేశ్‌ బాబు సినీ నటుడు

అర్బన్‌ నక్సల్స్‌!
‘‘ఇకపై తప్పుడు కేసులు బనాయిం చొద్దు. దేశంలోని అత్యుత్తమమైన మానవ హక్కుల కార్యకర్తలు, లాయర్లు, రచయితల్ని అర్బన్‌ నక్సల్స్‌ అని పిలవడం ఇక ఆపండి. ఈ పిలుపు చాలా అసాధారణంగా ఉంది’’ – జిగ్నేష్‌ మేవాని గుజరాత్‌ ఎమ్మెల్యే

విఫల ప్రయోగం
‘‘పెద్ద నోట్ల రద్దు ఒక విఫల ప్రయోగం. ఆర్‌బీఐ సొంత నివేదిక ఈ విష యాన్ని తేటతెల్లం చేస్తోంది. నోట్ల రద్దుతో మోదీ విఫల మయ్యారని మీరు అనుకుంటున్నారా లేదా? పెద్ద నోట్ల రద్దుతో అందరికంటే ఎక్కువగా దెబ్బతిన్నది మహిళలు మాత్రమే’’ – ప్రియాంకగాంధీ

టెస్ట్‌ క్రికెట్టే కీలకం
‘‘ఓ టెస్ట్‌ ప్లేయర్‌గా ఏ కొత్త ఫార్మాట్‌కూ మారాలని నేను అనుకోవడం లేదు. నాకు మాత్రం ఈ కొత్త ఫార్మాట్‌పై ఆసక్తి లేదు. కొత్త ఫార్మాట్‌లో ఆడాలనీ లేదు. ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు లాంచ్‌ చేయనున్న కొత్త ఫార్మాట్‌లో నేను ఎన్నటికీ ఉండను. క్రికెట్‌ బోర్డులు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వకపోతే క్రికెట్‌ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ బోర్డులు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని టెస్టు క్రికెట్‌ను కాపాడాలి’’ – విరాట్‌ కోహ్లీ టీమిండియా కెప్టెన్‌

కౌంట్‌డౌన్‌ మొదలైంది
‘"#Heartbeats4hockey ని ప్రారంభించడంతో ఒడిశా హాకీ పురుషుల వరల్డ్‌ కప్‌ 2018కి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. అందరూ రండి. ఈ వరల్డ్‌ కప్‌ ప్రచారంలో పాల్గొనండి’’
– నవీన్‌ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top