అమ్మాయిల కన్యత్వంపై ఫ్రొఫెసర్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు

Kolkata Professor Shares Controversial Post On Virgin Brides - Sakshi

కోల్‌కతా : అమ్మాయిల కన్యత్వంపై ఓ ఫ్రొఫెసర్‌ అభ్యంతకర వ్యాఖ్యలు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ‘అబ్బాయిలు.. సీల్‌ ఊడిన కూల్‌ డ్రింక్స్‌ కొంటారా? అలాంటప్పుడు కన్యత్వం కోల్పోయిన అమ్మాయిలను ఎలా పెళ్లి చేసుకుంటారు? అబ్బాయిలు కన్యత్వం కలిగిన యువతుల విషయంలో మోసపోతున్నారు. వర్జినిటీ కలిగిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లభించే లాభాల గురించి వారికి అవగాహన లేదు. కన్యత్వం కలిగిన అమ్మాయిలు దేవదూతలు’ అంటూ కోల్‌కతాలో జాధవ్‌పూర్‌ యూనివర్సిటీకి చెందిన కనక్‌ సర్కార్‌ అనే ఫ్రొఫెసర్‌ ఫేస్‌బుక్‌లో వరుసగా పోస్ట్‌లు చేశాడు. ఈ పోస్ట్‌లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంకావడంతో ఫ్రొఫెసర్‌ ఆ పోస్ట్‌లను తొలిగించాడు. మరో పోస్ట్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు విలువలకు పాతరేస్తూ పెళ్లికి ముందే తమ వర్జినిటీని కోల్పోతున్నారని, దీంతో అబ్బాయిలు అమ్మాయిల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చాడు.

అమ్మాయిలు తమ లైఫ్‌ పార్టనర్‌కు వర్జినిటీ విషయం తెలియజేస్తే వారు గౌరవిస్తారని, ప్రతి పురుషుడు వర్జినిటీ కలిగిన భార్యను గౌరవిస్తారని మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ విషయం అమ్మాయిలకు కూడా బాగా తెలుసని చెప్పుకొచ్చాడు. జపాన్‌లో 99 శాతం యువతులు పెళ్లి అయ్యేవరకు కన్యత్వాన్ని కోల్పోరని, అందుకే వారి సమాజం బాగుందని, జపాన్‌ అభివృద్దిలో దూసుకుపోతుందని ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. అయితే ఓ ఫ్రొఫెసర్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top