సో సాడ్‌.. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?!

Is This Deepika Padukone Photoshoot Netizens On Srila Rao Wedding Viral pic - Sakshi

‘సో సాడ్‌.. పెళ్లిలో వధువుపైనే కదా అందరి దృష్టి ఉంటుంది. మీరు మాత్రం ప్రచారం కోసం ఆమెను తక్కువగా చేసి చూపారు. పెళ్లి అనే మధుర ఙ్ఞాపకం వ్యక్తుల జీవితంలో ఎంతో ప్రత్యేకమైంది. పక్కన ఎంతమంది సెలబ్రిటీలు ఉన్నా ఆ ఒక్కరోజు వధువు మాత్రమే సెలబ్రిటీ అవుతారు. అసలు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు’ అంటూ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన సినిమాటోగ్రాఫర్‌ శ్రీలా రావు పెళ్లి ఫొటోలను సవ్యసాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడమే ఇందుకు కారణం.

మంగళవారం శ్రీలా రావు పెళ్లి ఫొటోలను షేర్‌ చేసిన సవ్యసాచి... ‘ రియల్‌ బ్రైడ్‌ శ్రీలా రావు శ్రీలంకలోని బెంటోటా విల్లాలో జరిగిన తన వివాహంలో సవ్యసాచి డిజైనర్‌ దుస్తులు ధరించారు’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. అయితే ఈ ఫొటోల్లో శ్రీలా రావు కంటే కూడా ఆమె స్నేహితురాలు, స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనేను హైలెట్‌ చేయడంతో నెటిజన్లు సవ్యసాచి, ఫొటోగ్రాఫర్‌ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top